తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద
ది ది ది తై
నీ వెలుగు పంచు మా తెలివి లోన కొలువై….
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై
ససని సగస సగమ
మమగ మపమ మపని
పప మపనిస సని సగస నిసని పనిస
మపమ గమగస
ససని సగస సగమ
మమగ మపమ మపని
పప మపనిస సని..ఆ ఆ ఆ
చెవులారా వింటూనే ఎంత పాటమైనా
ఈసీ గా తలకెక్కే ఇంకివ్వు
కనులారా చదివింది ఒకసారే అయినా
కళ్ళోనూ మరిచిపోని మెమరీనివ్వు
చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు
చదవనిదేదైనా చాయిస్ పోనివ్వు
ఒక్కొక్క దానికి ఒక్కొ మార్కు పండివ్వు
ఏ టెంషన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు
ఆన్సర్ షీట్ పైన ఆగిపోని పెన్నివ్వు
తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై
తల స్నానం చేయకుండా పూజించానంటూ
నా వైపు కోపంగా చూస్తే ఒట్టు
షాంపుతో పాటే చదివింది తుర్రు మంటూ
వాష్ అయిపోతుందని నా సెంటిమెంటు
తలలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు
మీరు తలుచుకుంటే మా తలరాతలు తారు మారు
భారతం రాసిన చేతితో
బతుకును దిద్దేయి బంగారు
పేపర్ లో ఫోటో రాంకులెవరడిగారు
పాసు మార్కులిచ్చీ నిలబెట్టుకో నీ పేరు
తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు తిరు తిరు తిరు తిరు గణనాద ది ది ది తై
Tiru Tiru Gananadha Song Details
Tiru Tiru Gananadha
Singers: Harini
Lyrics: Ramajogayya Sastri
Music: Devi Sri Prasad