Aakaasam Nee Haddhu Ra: Cast by Suriya and Aparna Balamurali. Music by Jeevi Prakash Kumar. Directed by Sudha Kongara. Produced by Suriya, Rajashekar, Karpura Sundarapandyan, Gunith Monga and Alif Surthy.
Table of Contents
Katuka Kanule Mericy Poye Lyrics
లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ
లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ
లల్లాయి లాయిరే లాయిరే… లాయ్
లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ
కాటుక కనులే మెరిసిపోయే… పిలడా నిను చూసి
మాటలు అన్ని మరిసిపోయా… నీళ్ళే నమిలేసి…
ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు… గుండెకెంత సందడొచ్చేరా
వేప చెట్టు ఆకులన్ని గుమ్మరించినట్టు… ఈడుకేమో జాతరొచ్చేరా…
నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా
రాతిరంత నిదురపోని అల్లరే నీదిరా..!
మొడుబారి పోయి ఉన్న… అడవిలాంటి ఆశకేమో
ఒక్కసారి చివురులొచ్చేరా…
నా మనసే నీ వెనకే తిరిగినది…
నీ మనసే నాకిమ్మని అడిగినది…
లల్లాయి లాయిరే లాయిరే… లాయ్
లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ
లల్లాయి లాయిరే లాయిరే… లాయ్
లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ
గోపురాన వాలి ఉన్న పావురాయిలా…
ఎంత ఎదురు చూసినానో అన్ని ధిక్కులా…
నువ్వు వచ్చినట్టు ఏదో అలికిడవ్వగా…
చిట్టి గుండె గంతులేసే చెవుల పిల్లిలా…
నా మనసు విప్పి చెప్పనా… సిగ్గు విడిచి చెప్పనా
నువ్వు తప్ప ఎవ్వరొద్దులేరా..!
నే ఉగ్గబట్టి ఉంచినా… అగ్గి అగ్గి మంటనీ
బుగ్గ గిల్లి బుజ్జగించుకోరా..!!
నీ సూదిలాంటి చూపుతో… ధారమంటి నవ్వుతో
నిన్ను నన్ను ఒకటిగా కలిపి కుట్టరా…
నా నుదిటి మీద వెచ్చగా… ముద్దు బొట్టు పెట్టారా
కుట్టి కుట్టి పోరా…ఆ ఆ, కందిరీగ లాగా…
చుట్టు చుట్టుకోరా… ఆ ఆ, కొండచిలువ లాగా…
కత్తి దుయ్యకుండ సోకు తెంచినావురా…
గోరు తగలకుండ నడుము గిచ్చినావురా…
అయ్యబాబోయ్ అస్సలేమి ఎరగనట్టుగా…
రెచ్చగొట్టి తప్పుకుంటావెంత తెలివిగా…
నీ పక్కనుంటే చాలురా… పులస చేప పులుసులా
వయసు ఉడికిపోద్ది తస్సదియ్యా…
నే వేడి వేడి విస్తరై… తీర్చుతాను ఆకలి
మూడు పూట్ల ఆరగించరయ్య…
నా చేతి వేళ్ళ మెటికలు… విరుచుకోర మెల్లిగా
చీరకున్న మడతలే చక్కబెట్టారా…
నీ పిచ్చి పట్టుకుందిరా… వదిలిపెట్టనందిరా
నిన్ను గుచ్చుకుంటా… ఆ ఆ, నల్లపూసలాగా
అంటిపెట్టుకుంటా… ఆ ఆ, వెన్నుపూసలాగా
Sitramaina Bhumi Song Lyrics
సిత్రమైన భూమి… సేసినాడా సామి…
మనుసులాడే ఆటే సూడు..హ హ..ఆటే సూడు.. యెహె యెహె..
ఆటే సూడు.. ఆటే సూడు. ఆటే ఆట..
ఆడే ఆట.. ఆట..ఆట.. ఆట..
బుజ్జి మట్టి బంతి మీద మనిషి వింత ఆటే సూడు..
రెప్ప వాలి రాలిపోతే.. పాడె మనకు వచ్చే తోడు…
సక్కగా ఏసుకోరా కారా సారా సుక్క..
సుక్కలోకేక్కినోడి ఖాతాలో ఈ లెక్క..
రాజు పేద హాయి బాధ బేధాలేవీ లేవు..
నూకలింక సెల్లిపోతే అందరిదొక్క సావు… ||2||
కోతినుంచి మనిషైనా జాతి మారలేదు..
రాతే సూడు.. నీతే సూడు
కోతే సూడు.. కోతే సూడు.. కోతి జాతి కోతే నీది.. పోతే పాతై ఆడు..
నీది నాది అన్న తీపి.. పోదు కదా పూడ్సేలోపు..
సచ్చినోన్నైనా లేపి.. ఆడిస్తున్న డబ్బే తోపు…
మందు బాబులంత గంతులేస్తే లుంగీలూడే..
ఆడాళ్ళ ఏడుపులే ఎలుగెత్తి పాడే..
సుట్టాలెందరున్నా సివర నీ తోడెవడు రాడులే..
మేడమిద్దెలెన్నున్న, నీ సోటే ఆరు అడుగులే… ||2||
కులం నాది తక్కువైతే… కులం నాది తక్కువైతే…
రక్తం రంగు మారుతుందా.. ఒంట్లో రక్తం రంగు మారుతుందా…
అరె నీకులము ఎక్కువైతే.. అరె నీకులము ఎక్కువైతే..
కొమ్ములుంటాయారా.. ఉంటాయరా..
కొమ్ములుంటే.. కొమ్ములుంటే.. కొమ్ము కొమ్ము…
కొమ్ములుంటే.. కుమ్మి.. కుమ్మి.. ఇరిసెయ్..
కులం తక్కువైతే ఒంట్లో బురద పారుతుందా..
నీకులం ఎక్కువైతే రక్తం రంగు మారుతుందా..
కాయ కష్టాన్ని నమ్ముకున్న కులం మాది..
మాయ మతలబులు నేర్చుకున్న కులం మీది.
నిప్పెట్టేటి మతము ఇక కప్పెట్టాలి మనము..
నిప్పెట్టేటి మతము ఇక కప్పెట్టాలి మనము..
కలలు కన్న బతుకు చితి చేరేలోపు వెతుకు.. ||2||
Pilla Puli Song Lyrics
కవ్వం చిలికినట్టే… గుండెల్ని కెలికేస్తివే
యుద్ధం జరిగినట్టే… ప్రాణాలు కుదిపేస్తివే
పాల సంద్రాల లోతట్టు దీవుల్లో పుట్నట్టు
ముత్తెంలా ఉన్నావే ముక్కట్టు…
కొన్ని అందాలు చూపెట్టు… ఇంకొన్ని దాపెట్టు
మొత్తంగా నా నోరే ఊరేట్టు…
పిల్ల పులి… పిల్ల పులి
పోరాగాడే… నీకు బలి
ఎర వేశావే… సంకురాతిరి సోకుల సంపదని
నరికేసావే… నా రాతిరి నిద్దరని
బంగాళాఖాతంలో పడ్డావే… బంతి రెక్క
ఎంతెంత తూఫాను… రేపావే తస్సచక్క
నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే
అల్లాడించావే… ఏ ఏ ఏ
పిల్లా నచ్చావే… ఏ ఏఏ
నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే
ఏ ఏఏ ఏ…
చెంపల్లో తారాడే రవ్వల ఝుంకీలా… నన్నట్టా పెట్టేసుకో
పాదాలు ముద్దాడే మువ్వల పట్టీలా… నీ జంట తిప్పేసుకో
నీ నుదిటి సెమటల్లో కుంకాల బొట్టల్లె… తడవాలి నా కల
నీ ఓర చూపుల్లో విసిరేసి పోయిందే… నా పాలి వెన్నెల
పిల్లా… భూమికొక్క పిల్లా
ఎల్లా… నిన్ను ఒదిలేదెల్లా.. హోయ్
నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే
మామూలు మాటైనా… కొట్నట్టు తిట్నట్టు మా ముక్కుసూటిలే
నిన్నట్టా చూస్తాంటే… నన్నే చూస్తనట్టు కేరింతలైతినే
హో… నీలాంటి పిల్లమ్మి మల్లొచ్చి… నా కంట పడతాదో లేదో లే
ఓ వెయ్యి జనమాలు ఆలస్యం… అయితేనేం నీ కోసం చూస్తానే
సొట్ట బుగ్గ పిట్టా… నీకు తాళి కట్టా
ఇట్టా… ముందుగానే పుట్టా
హోయ్… నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే
ఎర వేశావే… సంకుతాతిరి సోకుల సంపదని
నరికేసావే… నా రాతిరి నిద్దరని
బంగాళాఖాతంలో పడ్డావే… బంతి రెక్క
ఎంతెంత తూఫాను… రేపావే తస్సచక్కా
Nadi Gundello Nippundi Song Telugu Lyrics
తానే నననానే… నననానే నననానే
తానే నననానే… నననానే నననానే
నడి గుండెళ్ళో నిప్పుంది… మండిచూ దాన్నీ
ఆ మంటల్లో వెలిగించు… నీ రేపటిని
సుడిగుండాలు ఎదురైనా… లెక్కించకు దేన్నీ
ఎదురీదాలి చేరాలి… లక్ష్యాలని
ఒడ్డున ఉండి రాల్లేస్తారు…. నీ పస తెలియని చెత్త జనాలు
రత్నంలా నువు తేలిననాడు… మూసుకుపోవా వాగిన నోళ్ళు ||2||
ముక్క చెక్కలుగ విరిచెయ్… నీకెదురుపడిన చిక్కులని
ఉక్కు రెక్కలతొ ఎగరెయ్… నిను నమ్ముకున్న నీ కలని
తానే నననానే… నననానే నననానే
అదిగో ఆకాశం నీ హద్ధురా…
తానే నననానే… నననానే నననానే
దాన్నందే అవకాశం… వదలొద్దురా ఆఆ
ఇటురా అని చిటికేసావో… గెలుపెందుకు దిగి రావాలి
నీకూ మరి మిగితా వాళ్ళకి… తేడా ఎట్టా తెలియాలి
గర్వంగా చెప్పుకునేందుకు… నీకూ ఓ కథ కావాలి
చెమటోడ్చి పొందిన విజయం… పరిమళమై నిను చేరాలి
కన్ను చిన్నగున్నాదంటూ… చిన్న కలలు కంటావా
లేనిపోని పేదరికంతో… వాటికి గిరి గీస్తావా
మట్టిలోకి వెలిపోయావో… మళ్ళి పుట్టి వస్తావా
ఉన్నదొక్క జీవితమే… ఊరికే వదిలేస్తావా
మనసు పెట్టి పనిచేస్తూ… ఓర్పుతోనే అడుగేసెయ్
నీదైన మార్పుగా నేడే… సరికొత్త చెరితనే రాసెయ్
తన్నే తననానే తననానే నానే నానే
తన్నే తననానే తననానే నానే నానే…….
తానే నననానే… నననానే నననానే
తానే నననానే… నననానే నననానే……..
ఆకాశం నీ హద్దురా… పదా పదా పదా పద పద పదా
పదా పదా పదా… పదా పదా పదా పదా……
Okka Nimisham Song Telugu Lyrics
హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్… హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్
ఆ ఆఆ హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్… ఆ ఆఆ హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్
హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్… హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్
సఖియే… నానే ఏ ఏఏ ఏ… లారరరే ఏ ఏ తారరరె
తారరరె ఏ ఏ… తారరరే
ఒక్క నిమిషం నువు కనరాకుంటే… దిగులైతాదే ఏ ఏ
దోబూచికైనా నన్నొదిలెలిపోకే.. నువ్వెలిపోకే
నరనాడులన్నీ తడబడిపోతాయే… నువు లేకుంటే ఏ ఏ
నా ఊసులన్నీ ఊపిరి తీస్తాంది… చెలి నీకొరకే
పేరుకే నేనున్నా… నా ప్రాణంగా ఉంది నువ్వేనే, నువ్వేనే
ఒక్క నిమిషం… అరె, ఒక్క నిమిషం నువు కనరాకుంటే… దిగులైతాదే ఏ ఏ
దోబూచికైనా నన్నొదిలెలిపోకే.. నువ్వెలిపోకే
నెత్తురు చిందని కత్తి… నీ చూపుల ఒత్తిడని
కనరాని గాయమయేలా… కొసావే నా ఎదనీ
ఊపిరితిత్తుల ముంచే… పరదేశి అత్తరని
తలవాల్చానే ఒడిలోన… నీ శ్వాసకు దగ్గరనీ
మరుజన్ముంటే చీమై… నే పుడతానే
నీ పెదవుల తీపి అందేలా… తిప్పలు పడతానే
మరుజన్ముంటే చీమై… నే పుడతానే
నీ పెదవుల తీపి అందేలా… తిప్పలు పడతానే
కథలో ఎంకిని ఇంటా… మా గొప్పగ అనుకున్నా
నా ఎదురుగ నిన్నే చూసి… నీ కలలో పడుకున్నా
ఎవ్వరు రాసిన రాతో… నీ జతలో నేనున్నా
జన్మాలెన్నో అయినా… నా బతుకే నువ్వన్నా
పడతాడంటే పడిపోడా మొగవాడు
అంతోటి గొప్పగా మలిచాడే నిన్నాపైవాడు
పడతాడంటే పడిపోడా మొగవాడు
అంతోటి గొప్పగా మలిచాడే నిన్నాపైవాడు
సఖియే… నానే ఏ ఏఏ ఏ… లారరరే ఏ ఏ తారరరె
తారరరె ఏ ఏ… తారరరే
Sakhiyae Song Telugu Lyrics
సఖియే… ఏ ఏ ఏ ఏ ||3||
సిక్ఖటి సీకటి ముసిరి… నా గుండెలు సెదిరినవే
అన్ని దిక్కుల… నీ జాడ వెతికి
నా సూపులు అలిసినవే…
నిన్నటిలాగే మరలా… నే నీతో ఉండాలే
నీ భుజమున నా తల వాల్చి… ముంగురులతో ఆడాలే
పోలికేకైనది నీ కోసం… నా మనసు
నా ఊపిరి నిలిపే ఊపిరి నువ్వని… నీక్కూడా తెలుసు
పోలికేకైనది నీ కోసం… నా మనసు
నా ఊపిరి నిలిపే ఊపిరి నువ్వని… నీక్కూడా తెలుసు
ఎలే… ఏ ఏ ఏ ఏ… ఎలే… ఏ ఏ ఏ ఏ
ఎలే… ఏ ఏ ఏ ఏ… ఎలే… ఏ ఏ ఏ ఏ
పాడు సెయ్యి నీపై లేసిందే… తప్పైనాదే… ఏ ఏ ఏ
కోపమంతా కరిగిపోయిందే… నిను రమ్మందే
లోకమంతా తలక్రిందైనాదే… నువు లేకుంటే
నాకు నేను చేదనిపించానే… నీమీదొట్టే
తడబడి ఏమన్నా… కడదాకా నేను నీవాన్నే
నీవాన్నే… ఏ ఏ ఏఏ
పాడు సెయ్యి… నా పాడు సెయ్యి… నీపై లేసిందే
తప్పైనాదే… ఏ ఏ ఏ
కోపమంతా కరిగిపోయిందే… నిను రమ్మందే
సఖియే… ఏ ఏ ఏ ఏ
సఖియే… ఏ ఏ ఏ ఏ ||4||
Maha Theme Song Telugu Lyrics
ఘర్షణయ్యే నా అరుపు… తలవంచదు నా పొగరు
అణచాలని నువ్ చూసిన… కరవాలమై తిరిగి వస్తా
నన్ను తాకి చూడరా… మౌనం మారు మొగురా
తీర అశ్వం అడుగులోన… నలిగి నలిగి పోవురా
ఏ హే ఏ ఏ…
కదలరా… ఎదురు తిరిగి నిలవరా
గెలుపు తలుపు వెతకరా… పయనం సాగించరా
అరె..! వేట తీరు మారెరా
నన్ను తాకి చూడరా… చూడరా
Horu Gali Song Telugu Lyrics
హోరు గాలి కసిరెయ్… గిరగిర తిరిగేసెయ్
హూంకరించి బసవన్నయ్… గుద్ది తలుపు రంకెయ్
హేయ్ హేయ్ హేయ్… హేయ్ హేయ్
పిడుగు అడుగులేసి… ఇరగ ఇరగ తీసెయ్
దంచికొట్టి ఆరెయ్… దుమ్ము దులిపి పారెయ్
హా హా హా… హా హా
హా హా హా… హా హా
Aakaasam Nee Haddhu Ra (2020) Songs Lyrics
- చిత్రం: ఆకాశమే నీ హద్దు రా (2020)
- నటీనటులు: సూర్య , అపర్ణ బాలమురళి, మోహన్‌బాబు
- సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
- సాహిత్యం: భాస్కరభట్ల
- గానం: ధీ
- దర్శకత్వం: సుధా కొంగర
- నిర్మాణం : సూర్య, రాజశేఖర్ కర్పూర సుందరపాండ్యన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సుర్తి
- విడుదల తేది: 12.11.2020